యేసు

యేసు

"యేసుక్రీస్తు నిజజీవిత ఆధారంగా రూపించబడిన చిత్రం ""యేసు"", ఇది 1979 లో విడుదలై ఇంతవరకు 1,400 భాషల్లోకి అనువదించబడింది. ఇది చరిత్రలో అత్యంత ఎక్కువ బాషలలోకి అనువదింపబడి వీక్షించబడిన చిత్రంగా నిలచింది."" 'యేసు' చిత్రం సువార్త సాధనాలన్నిటిలోకల్ల అత్యంత ప్రభావవంతమైనది"" అని ""ది పర్పస్ డ్రివెన్ లైఫ్"" రచయిత పాస్టర్ రిక్ వారెన్ అంటారు. చారిత్రక మరియు బైబిల్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి 450 కంటే ఎక్కువ మత నాయకులు మరియు పండితులు చిత్ర రచనలను పరిశీలించారు. ఈ రచనలు లూకా సువార్త మీద ఆధారపడి ఉన్నాయి, కాబట్టి చిత్రంలో యేసు మాట్లాడే ప్రతి మాట దాదాపు బైబిల్ నుండి స్వీకరించినవే. సుమారు 2,000 సంవత్సరాల క్రితపు యూదా మరియు రోమన్ సంస్కృతిని చిత్రీకరించడానికి తీవ్రమైన ప్రయత్నము జరిగింది: అప్పటిలో వాడుకలొ ఉన్న 35 రంగులతో మాత్రమే నేసిన చేనేత వస్త్రాలు, మొదటి శతాబ్దపు పద్ధతులతో తయారు చేయబడిన మట్టి పాత్రలు, మరియు ఆధునిక టెలిఫోన్ స్తంభాలు మరియు విద్యుత్ లైన్లను తొలగించడం. యేసు చిత్రమును 1979 లో పూర్తిగా ఇశ్రాయేలు దేశములోని 202 ప్రదేశాలల్లో చిత్రీకరించారు, 5,000 మంది కంటే ఎక్కువ సంఖ్యతో కూడిన ఇజ్రాయిల్ మరియు అరబ్బుల తారాగణం తో చిత్రీకరించబడింది. వీలైనంతవరకూ, 2,000 సంవత్సరాల క్రితపు ఘటన ప్రదేశాలలోనే దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి."