కీర్తనలు 9:1-12

కీర్తనలు 9:1-12 - నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను
స్తుతించెదను
యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ
రించెదను.
మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి
హర్షించుచున్నాను
నీ నామమును కీర్తించెదను.
నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము
తీర్చుచున్నావు
నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు
తీర్చుచున్నావు
కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురు
నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.
నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను
నశింపజేసి యున్నావు
వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టి
యున్నావు.
శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ
నిర్మూలమైరి
నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండ
బొత్తిగా నశించెను.
యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై
యున్నాడు.
న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును
స్థాపించియున్నాడు.
యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును
యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
నలిగినవారికి తాను మహా దుర్గమగును
ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును
యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి
పెట్టువాడవు కావు
కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు
సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి
ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.
ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు
బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును
వారి మొఱ్ఱను ఆయన మరువడు.

నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను. మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టి యున్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండ బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు.

కీర్తనలు 9:1-12

కీర్తనలు 9:1-12