కీర్తనలు 19:1-14
![కీర్తనలు 19:1-14 - ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి
అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
పగటికి పగలు బోధచేయుచున్నది.
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన
బడదు.
వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి
యున్నది
లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి
వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి
కుమారుని వలె ఉన్నాడు
శూరుడు పరుగెత్త నుల్లిసించునట్లు తన పథమునందు
పరుగెత్త నుల్లిసించుచున్నాడు.
అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ
దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు
అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ
మైనది
అది ప్రాణమును తెప్పరిల్లజేయును
యెహోవా శాసనము నమ్మదగినది
అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి
హృదయమును సంతోషపరచును
యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది
కన్నులకు వెలుగిచ్చును.
యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది
నిత్యము నిలుచును
యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ
లము న్యాయమైనవి.
అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు
కంటెను కోరదగినవి
తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును
వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?
నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను
నిర్దోషినిగా తీర్చుము.
దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని
ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము
అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము
చేయకుండ నిందా రహితుడనగుదును.
యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా,
నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును
నీ దృష్టికి అంగీకారములగును గాక.](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F320x320%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fstatic-youversionapi-com%2Fimages%2Fbase%2F38471%2F1280x1280.jpg&w=640&q=75)
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన బడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు శూరుడు పరుగెత్త నుల్లిసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లిసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ లము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండ నిందా రహితుడనగుదును. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.
కీర్తనలు 19:1-14