కీర్తనలు 107:1-22

కీర్తనలు 107:1-22 - యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించుడి
ఆయన కృప నిత్యముండును.
యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు
గాక
విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును
తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి
దక్షిణము నుండియు
నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును
ఆమాట పలుకుదురుగాక.
వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి.
నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.
ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.
వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
వారొక నివాస పురము చేరునట్లు
చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు
ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి
యున్నాడు.
ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి
యున్నాడు.
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని
తీర్మానమును తృణీకరించినందున
బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై
చీకటిలోను మరణాంధకారములోను
నివాసముచేయువారి హృదయమును
ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.
కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
వారి కట్లను తెంపివేసి
చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు
వారిని రప్పించెను.
ఆయన కృపనుబట్టియు
నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక.
ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి
యున్నాడు
ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము
చేతను బాధతెచ్చుకొందురు.
భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు.
కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి
ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను
ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు
ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు
గాక.
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక
ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు
దురుగాక.

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను.వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు వారిని రప్పించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు. భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్యమగునువారు మరణద్వారములను సమీపించుదురు. కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.

కీర్తనలు 107:1-22

కీర్తనలు 107:1-22