దుష్టుల ఆలోచనచొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటికాలువల యోరను నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును
అతడు చేయునదంతయు సఫలమగును.