సామెతలు 15:1-4
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
సామెతలు 15:1-4