విలాపవాక్యములు 3:21-66

విలాపవాక్యములు 3:21-66 - నేను దీని జ్ఞాపకము చేసికొనగా
నాకు ఆశ పుట్టుచున్నది.
యెహోవా కృపగలవాడు
ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక
మనము నిర్మూలము కాకున్నవారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది
నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను
ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా
ళుడు
తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ
కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే.
గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ
వలెను.
నిరీక్షణాధారము కలుగునేమో యని
అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప
వలెను.
అతడు నిందతో నింపబడవలెను
ప్రభువు సర్వకాలము విడనాడడు.
ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి
పడును.
హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము
నైనను బాధనైనను కలుగజేయడు.
దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద
త్రొక్కుటయు
మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల
గించుటయు
ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు
ప్రభువు మెచ్చుకార్యములు కావు.
ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా
డెవడు?
మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును
బయలు వెళ్లునుగదా?
సజీవులేల మూల్గుదురు?
నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
మన మార్గములను పరిశోధించి తెలిసికొని
మనము యెహోవాతట్టు తిరుగుదము.
ఆకాశమందున్న దేవునితట్టు
మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము
నీవు మమ్మును క్షమింపలేదు.
కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము
చున్నావు
దయ తలచక మమ్మును చంపుచున్నావు.
మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత
నిన్ను కప్పుకొనియున్నావు.
జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి
యున్నావు.
మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి
చేసెదరు.
భయమును గుంటయు పాడును నాశనమును మాకు
తటస్థించినవి.
నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా
కన్నీరు ఏరులై పారుచున్నది.
యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు
వరకు
నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు
నేను దుఃఖాక్రాంతుడనైతిని.
ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా
నన్ను వెనువెంట తరుముదురు.
వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి
నాపైన రాయి యుంచిరి
నీళ్లు నా తలమీదుగా పారెను
నాశనమైతినని నేననుకొంటిని.
యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి
నేను నీ నామమునుబట్టి మొరలిడగా
నీవు నా శబ్దము ఆలకించితివి
సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా
చెవిని మూసికొనకుము.
నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు
వచ్చితివి
–భయపడకుమి అని నీవు చెప్పితివి.
ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము
లను వాదించితివి
నా జీవమును విమోచించితివి.
యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి
యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన
లన్నియు నీవెరుగుదువు.
యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని
నామీదికి లేచినవారు పలుకు మాటలును
దినమెల్ల వారు నామీదచేయు ఆలోచనయు నీవు
వినియున్నావు.
వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని
పెట్టుము
నేను వారి పాటలకు ఆస్పదమైతిని.
యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ
కారము చేయుదువు.
వారికి హృదయకాఠిన్యము నిత్తువువారిని శపించుదువు.
నీవు కోపావేశుడవై వారిని తరిమి
యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ

నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను. నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు. ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా డెవడు? మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా? సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు? మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు. కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు. మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు. జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు. మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి –భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. పగతీర్చుకొనవలెనని వారు నామీదచేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీదచేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని పెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు. వారికి హృదయకాఠిన్యము నిత్తువువారిని శపించుదువు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ

విలాపవాక్యములు 3:21-66