విలాపవాక్యములు 3:21-33

విలాపవాక్యములు 3:21-33 - నేను దీని జ్ఞాపకము చేసికొనగా
నాకు ఆశ పుట్టుచున్నది.
యెహోవా కృపగలవాడు
ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక
మనము నిర్మూలము కాకున్నవారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది
నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను
ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా
ళుడు
తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ
కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే.
గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ
వలెను.
నిరీక్షణాధారము కలుగునేమో యని
అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప
వలెను.
అతడు నిందతో నింపబడవలెను
ప్రభువు సర్వకాలము విడనాడడు.
ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి
పడును.
హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము
నైనను బాధనైనను కలుగజేయడు.

నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను. నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.

విలాపవాక్యములు 3:21-33