యెషయా 41:13-20

యెషయా 41:13-20 - నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము
నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు
నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా
యేలూ, భయపడకుడి
నేను నీకు సహాయము చేయుచున్నాను
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు
నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి
మ్రానుగా నిన్ను నియమించియున్నాను
నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయు
దువు
కొండలను పొట్టువలె చేయుదువు
నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును
సుడిగాలి వాటిని చెదరగొట్టును.
నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు
ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.
దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది,
యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను
ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము
చేసెననియు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు
తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు
నట్లు
చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను
లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను
అరణ్యమును నీటిమడుగుగాను
ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.
నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ
చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం
చెదను
అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి
వృక్షములను నాటెదను.

నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా యేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకకవారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లు చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.

యెషయా 41:13-20

యెషయా 41:13-20