విశ్రాంతి లేని వారికి విశ్రాంతినమూనా

విశ్రాంతి లేని వారికి విశ్రాంతి

3 యొక్క 2


  

ఆత్మీయ పాఠము

రెండవ రోజు: యేసు నొద్దకు రమ్ము

ఎంతో ఒత్తిడితో నిండియున్న ప్రపంచములో మనము జీవిస్తున్నాము. ఇంటి దగ్గర, పాఠశాలలో, కాలేజిలో, పని చేసే స్తలాలలో, దాదాపు ప్రతి చోట, ప్రతి ఒక్కరము ఒత్తిడి ఎదురుకొనుచున్నాము. ఈ మధ్య కాలములో ‘ది ఎకనామిక్ టైమ్స్‘ (సెప్టెంబరు 12, 2016)లో వ్రాసిన ఒక వ్యాసాన్ని చదివాను. ఆ వ్యాస సారాంశమేదనగా ‘భారత దేశములో పనిచేసే వారిలో 46% మంది ప్రజలు తాము పనిచేసే స్తలాలో ఏదోక విధమైన ఒత్తిడిని ఎదుర్కొనుచున్నారు. నేను భావించేదేమంటే ప్రపంచములోని ఇతర దేశాలలో నివసించే వారి విషయములో కూడా ఇది సత్యము. ఈ ఒత్తిడినుంచి బయట పడుట కొరకు ప్రజలు మధ్యపానము, షాపింగ్ చేయడము,  సినిమాలు చూడటము, టి.వి చూడటము, ఇంటర్నెట్లో ఎక్కువ సమయము గడపటము, అక్రమ సంబంధాలు కలిగి ఉండటము, మత్తు ద్రవ్యాల వాడకము వంటి వాటివాపు మరలుచుంటారు. కాని ఇవి ఏవి కూడా మనము ఎదుర్కొనుచున్న ఒత్తిడికి శాస్వత పరిస్కార మార్గాలు కావు. అయితే ఈ ఒత్తిడినుంచి విడుదల పొందుటకై దీర్గకాలిక పరిస్కార మార్గమేది? యేసే ఆ పరిస్కార మార్గము! అవును, మత్తయి సువార్త 11:28 లో ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారిని తన యొద్దకు వచ్చి విశ్రాంతి పొందుకోమని యేసు ఆహ్వానిస్తున్నారు.

విశ్రాంతిని పొందటానికి ఎక్కడకో వెళ్ళమని యేసు ప్రభువు వారు సెలవియ్యలేదు కాని తన యొద్దకు రమ్మని ఆయన సెలవిచ్చుచున్నారు. మన భారాలకు పరిష్కారము తానేనని మనకు తెలియజేయుచున్నాడు. ఇది నిజముగా ఒక అధికారపూర్వకమైన ఆహ్వానము. అలా ఎందుకు చెబుతున్నానంటే ఇతరులకు విశ్రాంతిని, విరామమును అనుగ్రహించుట అనేది కేవలము దేవుని ఆధిక్యత హక్కు మాత్రమే (యెషయా 40:28-31). కేవలము దేవుడు మాత్రమే మనకు నిజమైన విశ్రాంతిని అనుగ్రహించువాడు. ఇక్కడ మనకు ఈ విశ్రాంతిని ఇస్తానంటున్నది యేసు క్రీస్తులు వారు. కాబట్టి ఇది ఒక సాధారణ బోధకుడు లేదా ప్రవక్త యొక్క ఆహ్వానము కాదు కాని మానవాతారియైన దేవుడే అనగా యేసే ఈ అధికారపూర్వకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నారు. సత్యమేమంటే యేసు నొద్దకు రాకుండా నీవు ఈ విశ్రాంతిని అనుభవించలేవు. 

యేసు నొద్దకు వచ్చుట అనగా యేసు నందు నమ్మిక యుంచుటయే (యోహాను 6:35 నందు సరి పొల్చండి- ఇచ్చట యేసు నొద్దకు వచ్చుట మరియు యేసు నందు నిమ్మిక యుంచుట అను వాటిని పర్యాయ పదాలుగ వాడుట జరిగింది). మనము విశ్వసించ వలసినది ఒక సంఘాన్నొ, సంఘ కాపరినో, సిధ్ధాంతమునో, లేదా మరి దేనినో కాదు గాని మనము క్రీస్తునే విశ్వసించవలెను. మనము యేసు నందు నమ్మికయుంచినప్పుడు మాత్రమే నిజ విశ్రాంతిని పొందుకుంటాము.

భూమిమీదనున్న ఏవ్యక్తీ ఇట్టి ఆహ్వానాన్ని ఇవ్వజాలడు. తుదకు మీ స్వంత తల్లిదండ్రులు, బార్య-భర్త, పిల్లలు, లేదా నీకు అత్యంత ఆప్త మిత్రుడు కూడా ఇట్టి ఆహ్వానాన్ని ఇవ్వజాలరు. కేవలము యేసు మాత్రమే మనకు ఈ ఆహ్వానాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనే మనకు నిజమైన విశ్రాంతిని ఇవ్వగలిగిన వ్యక్తి. యేసే మార్గము, సత్యము, జీవము (యోహాను 14:6). ఆయన మన రక్షణ. ఆయన మన నిరీక్షణ. ఆయనే పునరుత్ధానము జీవమునైయున్నవాడు (యోహాను 11:25). ఆయన ఓ గొప్ప నిధి. ఆయన మాత్రమే మన సమస్యలన్నింటికి పరిష్కారము. అందుచేతనే ఆయన మనలను తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ రోజే యేసు నొద్దకు రమ్ము!

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

విశ్రాంతి లేని వారికి విశ్రాంతి

ఈ ఆత్మీయ పాఠములు దేవుని అన్వేశించు వారికి క్రీస్తును కనుగొనుటకు, విశ్వాసులైన వారికి కలిగే కష్టనష్టములలో క్రీస్తుయందు విశ్రాంతి పొందుకొనుటకు సహాయపడుతుంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు డాక్టర్ డేవిడ్ మెండే గారికి మరియు ఎల్-షద్ధాయ్ అసెంబ్లీ అఫ్ గాడ్ చర్చి కి మేము ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి వారి వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://elshaddaiag.in/