తీతుకు 2:3-5
తీతుకు 2:3-5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగివుండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండుమని బోధించు. అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని, స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండుమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండుమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండుమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు.
తీతుకు 2:3-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.
తీతుకు 2:3-5 పవిత్ర బైబిల్ (TERV)
అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.
తీతుకు 2:3-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆలాగుననే వృద్ధీస్తలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము.
తీతుకు 2:3-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు. అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని, స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు.