పరమగీతము 4:12-16
పరమగీతము 4:12-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము. నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు. నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.
పరమగీతము 4:12-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా సోదరీ, నా వధువు! నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు. నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో, జటామాంసి కుంకుమ పువ్వు, వోమ దాల్చిన చెక్క, ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, బోళం కలబంద, అన్ని సుగంధద్రవ్యాలు. నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, లెబానోను నుండి దిగువకు ప్రవహించే, నీటి ఊటలు కల బావివి. ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.
పరమగీతము 4:12-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట. నీ కొమ్మలు దానిమ్మతోటలా ఉన్నాయి. దానిలో రక రకాల పళ్ళ చెట్లున్నాయి. గోరింటాకు, జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, అన్ని రకాల పరిమళతైల వనస్పతులున్నాయి. బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి. నువ్వు ఉద్యాన వనంలోని నీటి ఊట. మంచినీటి బావి. లెబానోను నుంచి ప్రవహించే సెలయేరు. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఉత్తర గాలీ, రా! దక్షిణ గాలీ, రా! నా ఉద్యానవనం మీద వీచు. వాటి సుగంధాల పరిమళాలను వ్యాపింపనీ. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వస్తాడు గాక! దాని శ్రేష్ట ఫలాలను అతడు తింటాడు గాక!
పరమగీతము 4:12-16 పవిత్ర బైబిల్ (TERV)
నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి. మూయబడిన ఉద్యానవనం వలె, మూయబడిన జలాశయంవలె, మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు. నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి, కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన సుందర వనాన్ని పోలినది. నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి, మంచినీటి ఊటల బావిలాంటిదానివి, లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి. ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి అందలి మధుర ఫలాలు ఆరగించాలి.
పరమగీతము 4:12-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము. నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు. నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.
పరమగీతము 4:12-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)