పరమగీతము 4:1-7

పరమగీతము 4:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి. నీ పళ్ళు అప్పుడే కత్తెర వేయబడి, కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి, వాటిలో ఒక్కటి కూడా ఒంటరిగా లేదు. నీ పెదవులు ఎర్ర త్రాడులా ఉన్నాయి; నీ నోరు మనోహరము. నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, సగం దానిమ్మ పండులా ఉన్నాయి. నీ మెడ అందంగా నిర్మించబడిన దావీదు గోపురంలా ఉన్నది; దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; అవన్నీ శూరుల డాళ్లు. నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, తామర పువ్వుల మధ్య మేసే దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. తెల్లవారుజాము రాకముందు నీడలు పారిపోకముందు, నేను బోళం కొండకు బోళం పర్వతానికి వెళ్తాను. నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; నీలో ఏ కంళంకమూ లేదు.

పరమగీతము 4:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ, నువ్వెంత అందంగా ఉన్నావు! ప్రియురాలా! నువ్వెంత అందంగా ఉన్నావు! నీ ముసుకు గుండా కన్పించే నీ కళ్ళు, గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి. నీ జుట్టు గిలాదు పర్వతం మీద నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది. ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా నీ పళ్ళు ఉన్నాయి. ఒక్కటీ పోకుండా అవి జోడుజోడుగా ఉన్నాయి. నీ అధరాలు ఎరుపు నూలులాగా ఉన్నాయి. నీ నోరు మనోజ్ఞంగా ఉంది. నీ ముసుకు గుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి. నీ మెడ, వరసల్లో రాళ్ళు పేర్చి కట్టిన దావీదు గోపురంలా ఉంది. దాని మీద వెయ్యి డాలులు వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ సైనికుల డాలులే. నీ రెండు స్తనాలు లిల్లీ పూల మధ్య మేస్తున్న కవల జింకపిల్లల్లా ఉన్నాయి. తెల్లారే లోపు చీకటి నీడలు తొలిగి పోయేలోగా నేను బోళం కొండకు వెళ్తాను. సాంబ్రాణి కొండకు వెళ్తాను. ప్రేయసీ, నువ్వు నిలువెల్లా అందమే. నీలో ఏ దోషం లేదు.

పరమగీతము 4:1-7 పవిత్ర బైబిల్ (TERV)

నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు క్రింద నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి. గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి, కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు. నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి. నీ నోరు అందంగా ఉంది నీ మేలి ముసుగు క్రింద నీ చెక్కిళ్లు రెండు దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి. నీ మెడ పొడుగ్గా సన్నగా జయ సూచకాల్ని ఉంచే దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యి డాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు. నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి. సూర్యాస్తమయ వేళ, నీడలు కనుమరుగయ్యే వేళ నేను ఆ గోపరస పర్వతానికి వెళ్తాను ఆ సాంబ్రాణి కొండకు వెళ్తాను. నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!

పరమగీతము 4:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలుకలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధర సమానము. నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును. నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.

పరమగీతము 4:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)