పరమగీతము 3:6-10

పరమగీతము 3:6-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారమువారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు. దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపెనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.

పరమగీతము 3:6-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ధూమ స్తంభాకరంలో వర్తకుల దగ్గర సుగంధ చూర్ణాలన్నిటితో తయారుచేయబడిన బోళం పరిమళ వాసనతో అరణ్య మార్గాన నడిచి వస్తున్నదేంటి? చూడండి! ఆ వచ్చేది సొలొమోను పల్లకి, అరవైమంది శూరుల భద్రతలో ఇశ్రాయేలీయులలో అతి జ్ఞానముగల యోధులు, వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు, యుద్ధంలో అనుభవం కలవారు, ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి, ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు. సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; లెబానోను మ్రానుతో తయారైన పల్లకి. దాని స్తంభాలు వెండివి, అడుగుభాగం బంగారం, దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది, దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో అలంకరించబడింది.

పరమగీతము 3:6-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

[మూడవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) ధూమ స్తంభంలాగా ఎడారి దారిలో వచ్చేది ఏంటది? బోళం, సాంబ్రాణి పరిమళాలతో వర్తకులమ్మే రకరకాల సుగంధ చూర్ణాలతో గుబాళిస్తూ వచ్చేది ఎవరు? అదుగో సొలొమోను పల్లకి. అరవై మంది వీరులు దాని చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు వీరులు. వారంతా కత్తిసాములో నిష్ణాతులు. యుద్ధరంగంలో ఆరితేరిన వారు. రాత్రి పూట జరిగే అపాయాలకు సన్నద్ధులై వస్తున్నారు. లెబానోను మానుతో ఒక పల్లకి సొలొమోనురాజు తనకు చేయించుకున్నాడు. దాని స్తంభాలు వెండితో చేశారు. దాని అడుగుభాగం బంగారుది. దాని దిండ్లు ఊదా రంగువి. యెరూషలేము కుమార్తెలు ప్రేమతో దాని లోపలిభాగం అలంకరించారు.

పరమగీతము 3:6-10 పవిత్ర బైబిల్ (TERV)

పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల సువాసనలతో పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది. చూడు, సొలొమోను ప్రయాణపు పడక! అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు. వారు బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు! వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు, వారి పక్కనున్న కత్తులు, ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం! రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు పడక చేయించాడు, దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది. దాని స్తంభాలు వెండితో చేయబడ్డాయి, ఆధారాలు (కోళ్ళు) బంగారంతో చేయబడ్డాయి, పడుకొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది. యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.

పరమగీతము 3:6-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారమువారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు. దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపెనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.

పరమగీతము 3:6-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)