పరమగీతము 2:13-14
పరమగీతము 2:13-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి. బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
పరమగీతము 2:13-14 పవిత్ర బైబిల్ (TERV)
అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు. నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా, మనం వెళ్లిపోదాం!” కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం!
పరమగీతము 2:13-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపెట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
పరమగీతము 2:13-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది; ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి. నా ప్రియురాలా, లేచి, రా, నా సౌందర్యవతి, నాతో రా. బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము.