రూతు 1:4-5
రూతు 1:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు. సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది.
రూతు 1:4-5 పవిత్ర బైబిల్ (TERV)
మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు. అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది
రూతు 1:4-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు. వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.
రూతు 1:4-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత, మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. నయోమి, తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.