రోమా 4:6-8
రోమా 4:6-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. ప్రభువుచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ధన్యులు.”
రోమా 4:6-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. ఎలా అంటే, “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.”
రోమా 4:6-8 పవిత్ర బైబిల్ (TERV)
క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు: “దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు. ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు.”
రోమా 4:6-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు. ఏలాగనగా– తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.
రోమా 4:6-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)