రోమా 2:25-29

రోమా 2:25-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనినయెడల అతడు సున్నతి లేనివాడైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్న తియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

షేర్ చేయి
Read రోమా 2

రోమా 2:25-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు. అలా అని, సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా? శారీరకంగా సున్నతి చేయబడకపోయినా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం జీవిస్తున్నవారు, మీరు ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగియున్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు. పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; భౌతికంగా బాహ్యంగా పొందిన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగంలో కూడా యూదునిగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

షేర్ చేయి
Read రోమా 2

రోమా 2:25-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా? సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా? పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.

షేర్ చేయి
Read రోమా 2

రోమా 2:25-29 పవిత్ర బైబిల్ (TERV)

ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు. కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా? యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు. నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.

షేర్ చేయి
Read రోమా 2

రోమా 2:25-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది గాని మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు. అలా అని సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా? శారీరకంగా సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నవారు, ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు. పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు. అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

షేర్ చేయి
Read రోమా 2