రోమా 12:8-9
రోమా 12:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
రోమా 12:8-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ కృపావరం ధైర్యపరచడమైతే ధైర్యపరచు. ఆ కృపావరం దానం చేయడమైతే ధారళంగా దానం చేయి, ఆ కృపావరం ఇతరులను నడిపించడమైతే జాగ్రత్తగా నడిపించు, ఆ కృపావరం కనికరం చూపించడమైతే, దాన్ని సంతోషంగా చేయి. ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. దుష్టమైన దానిని ద్వేషించి మంచిదైన దానిని పట్టుకోవాలి.
రోమా 12:7-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి. మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.
రోమా 12:8-9 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి. ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి.
రోమా 12:8-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి. ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి.