కీర్తనలు 98:4-9
కీర్తనలు 98:4-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి. తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి. బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి. సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక! నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి. లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.
కీర్తనలు 98:4-9 పవిత్ర బైబిల్ (TERV)
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి. స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము. బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి. నదులారా, చప్పట్లు కొట్టండి. పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి. యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
కీర్తనలు 98:4-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి. సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
కీర్తనలు 98:4-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి; వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో, బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి. సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక. యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి. యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.