కీర్తనలు 92:7-13

కీర్తనలు 92:7-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం చెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు. గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్యువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు యెహోవా మందిరములో నాటబడినవారైవారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.

కీర్తనలు 92:6-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, వారు శాశ్వతంగా నాశనమవుతారని, తెలివిలేనివారికి తెలియదు, మూర్ఖులు గ్రహించరు. కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు. యెహోవా, మీ శత్రువులు, నిజంగా మీ శత్రువులు నశిస్తారు; కీడుచేసేవారంతా చెదరిపోతారు. మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి. నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను; నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను. నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు. వారు యెహోవా దేవాలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.

కీర్తనలు 92:7-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా! అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు. యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు. అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు. నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి. నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.

కీర్తనలు 92:7-13 పవిత్ర బైబిల్ (TERV)

దుర్మార్గులు గడ్డిలా మొలిచినా, చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు. కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు. యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు. కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు. సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు. నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను. నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను. నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు. మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.

కీర్తనలు 92:7-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం చెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు. గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్యువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు యెహోవా మందిరములో నాటబడినవారైవారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.

కీర్తనలు 92:6-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)