కీర్తనలు 9:16-18
కీర్తనలు 9:16-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు. సెలా దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు.
కీర్తనలు 9:16-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. సెలా. దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి. అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.
కీర్తనలు 9:16-18 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు. యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్ దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు. పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది. కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.
కీర్తనలు 9:16-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి యున్నాడు. దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు (హిగ్గాయోన్ సెలా.) దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు.
కీర్తనలు 9:16-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు. సెలా దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు.