కీర్తనలు 80:8-19
కీర్తనలు 80:8-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ రించెను. దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి? అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
కీర్తనలు 80:8-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు; మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు. మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు, అది వేళ్ళూనుకొని భూమిని నింపింది. దాని నీడ పర్వతాలను కప్పింది, దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి. దాని కొమ్మలు సముద్రం వరకు, దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి. దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు? అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి, పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి. సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి! ఆకాశం నుండి ఇటు చూడండి! ఈ ద్రాక్షవల్లిని గమనించండి. అది మీ కుడి హస్తం నాటిన వేరు, మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు. మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది; మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు. మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి. అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము; మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము. సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా, మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
కీర్తనలు 80:8-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు ఈజిప్టులోనుంచి ఒక ద్రాక్షాతీగె తెచ్చావు, ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు. దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది. దాని నీడ కొండలను కప్పింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి, దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకూ వ్యాపించాయి. దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు? అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి, పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి. సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు. నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు. దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక. నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు. అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం. యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.
కీర్తనలు 80:8-19 పవిత్ర బైబిల్ (TERV)
గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు. ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు. ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు. నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు. “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు. దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది. అది పర్వతాలను కప్పివేసింది. దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి. దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి. దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు? ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు. అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి. అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి. సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము. పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము. దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము. నీవు పెంచిన ఆ లేత మొక్కలను చూడుము. అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది. నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు. దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము. నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము. అతడు మరల నిన్ను విడువడు. అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు. సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము. నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
కీర్తనలు 80:8-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ రించెను. దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి? అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
కీర్తనలు 80:8-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)