కీర్తనలు 72:12-14
కీర్తనలు 72:12-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు. నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు. బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది.
కీర్తనలు 72:12-14 పవిత్ర బైబిల్ (TERV)
మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు. మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు. పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు. రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు. వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు. ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
కీర్తనలు 72:12-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
కీర్తనలు 72:12-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అవసరతలో ఉండి మొరపెట్టే వారిని, సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు. ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు, పేదవారిని మరణం నుండి రక్షిస్తారు. ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు, ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది.