కీర్తనలు 68:24-26
కీర్తనలు 68:24-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి.
కీర్తనలు 68:24-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది, పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు. ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు; వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు. మహా సమాజాలలో దేవుని స్తుతించండి; ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి.
కీర్తనలు 68:24-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు. చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు. సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
కీర్తనలు 68:24-26 పవిత్ర బైబిల్ (TERV)
విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు. గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు. మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
కీర్తనలు 68:24-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి.
కీర్తనలు 68:24-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)