కీర్తనలు 6:1-10

కీర్తనలు 6:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి. యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి; యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి. నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం? యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి. మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు? మూలుగుతూ నేను అలిసిపోయాను. రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుంది కన్నీటిలో నా మంచం మునిగిపోతుంది. విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి. నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి. యెహోవా నా మొర ఆలకించారు, కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి. కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు. నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు; వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు.

కీర్తనలు 6:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు. యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు. నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది? యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు. మరణంలో ఎవరికీ నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? నేను మూలుగుతూ అలసిపోయాను. రాత్రంతా కన్నీటితో నా పరుపు నానిపోతున్నది. నా కన్నీళ్లతో నా పడకను తడిపేస్తున్నాను. విచారంతో నా కళ్ళు మసకబారాయి. నా ప్రత్యర్థులందరి కారణంగా నా దృష్టి మందగించింది. పాపం చేసే వాళ్ళంతా నా దగ్గరనుంచి తొలిగి పొండి. ఎందుకంటే యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి విపరీతంగా కంగారు పడతారు. వాళ్ళు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి తిరిగిపోతారు.

కీర్తనలు 6:1-10 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. కోపగించి నన్ను శిక్షించవద్దు. యెహోవా, నా మీద దయ ఉంచుము. నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి. నా శరీరం మొత్తం వణకుతోంది. యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.? యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము. చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము. యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను. నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి. నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను. నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి. చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక. యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు. నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు. వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.

కీర్తనలు 6:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము. మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయువారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును. నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

కీర్తనలు 6:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)