కీర్తనలు 56:8-9
కీర్తనలు 56:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా. నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును.
కీర్తనలు 56:8-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా? నేను మీకు మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనుకకు తగ్గుతారు. దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను.
కీర్తనలు 56:8-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా. నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు.
కీర్తనలు 56:8-9 పవిత్ర బైబిల్ (TERV)
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు. కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు. దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.