కీర్తనలు 56:1-13
కీర్తనలు 56:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా దేవా! నాపై దయ చూపండి, ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు; వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు. నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను. దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను దేవునిలో నేను నమ్ముతాను భయపడను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు? రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు; వారి పథకాలన్నీ నా పతనం కొరకే. నా ప్రాణం తీయాలనే ఆశతో వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు, నా కదలికలు గమనిస్తారు. వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి; దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి. నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా? నేను మీకు మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనుకకు తగ్గుతారు. దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను. దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను, అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను. నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు? నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను. ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు తొట్రిల్లకుండ నా పాదాలను దేవుని ఎదుట నేను జీవపువెలుగులో నడవడానికి శక్తినిచ్చారు.
కీర్తనలు 56:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు. గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు. నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను. నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు? రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు. నాకు ఎప్పుడు హాని చేయాలా అని చూస్తుంటారు. వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు. నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు. దేవా, నీ కోపంతో ప్రజలను అణగదొక్కు. వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి. నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా. నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు. నా దేవుణ్ణి బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాను. యెహోవాను బట్టి ఆయన వాక్కును ఘనపరుస్తాను. నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు? దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు. అందుకే నేను నీకు మొక్కుకున్నాను. నీకు స్తుతియాగాలు అర్పిస్తాను.
కీర్తనలు 56:1-13 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము. రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు. నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు. నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు. నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను. నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను. నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు. వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు. నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. దేవా, వారిని తప్పించుకోనియ్యకుము, వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము. నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు. కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు. దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు. దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను. యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను. నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను. నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను. ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు. నేను ఓడిపోకుండా నీవు కాపాడావు. కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.
కీర్తనలు 56:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మ్రింగవలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మ్రింగ వలెనని యున్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర యించుచున్నాను. దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయ పడను శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాముచేయు దోషక్రియలచేత వారు తప్పించు కొందురా? దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా. నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును. దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి యున్నావు. నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.
కీర్తనలు 56:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)