కీర్తనలు 46:9-11
కీర్తనలు 46:9-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు. “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.” సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా
కీర్తనలు 46:9-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు. నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు. సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.
కీర్తనలు 46:9-11 పవిత్ర బైబిల్ (TERV)
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు. దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి. రాజ్యాలతో నేను స్తుతించబడతాను. భూమిమీద మహిమపర్చబడతాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
కీర్తనలు 46:9-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. –ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
కీర్తనలు 46:9-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)