కీర్తనలు 44:23-26
కీర్తనలు 44:23-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు? మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పెట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.
కీర్తనలు 44:23-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు. నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు? మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది. మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.
కీర్తనలు 44:23-26 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రభువా, లెమ్ము! నీవేల నిద్రపోతున్నావు? లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము! దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు? మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు? బురదలోకి మేము త్రోసివేయబడ్డాము. మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము. దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
కీర్తనలు 44:23-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి. మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? నా బాధను నా హింసను మరచిపోయారా? మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి. లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి.