కీర్తనలు 35:1-16
కీర్తనలు 35:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము –నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక. యెహోవాదూత వారిని పారదోలును గాకవారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక. యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును. అప్పుడు–యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును. కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడుచేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి.
కీర్తనలు 35:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి. నా ప్రాణాన్ని తీయాలని చూసేవారు అవమానపాలై సిగ్గుపడుదురు గాక; నా పతనానికి కుట్రపన్నిన వారు భయపడుదురు గాక. యెహోవా దూత వారిని తరుముతుండగా వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉందురు గాక. యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక. కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు. వారికి తెలియకుండానే వారి పైకి నాశనం వచ్చును గాక వారు నా కోసం దాచిన వలలో వారే చిక్కుకొందురు గాక! నా కోసం త్రవ్విన గొయ్యిలో వారే పడుదురు గాక. నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది ఆయన రక్షణలో సంతోషిస్తుంది. “యెహోవా, నిన్ను పోలినవారెవరు? బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” అని నా శక్తి అంతటితో నేను అంటాను. అబద్ధ సాక్షులు బయలుదేరుతున్నారు; నాకు తెలియని విషయాలను గురించి వారు నన్ను ప్రశ్నిస్తారు. మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తారు, నేను ఒంటరి వాడినయ్యాను. అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు, వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు నేను దుఃఖించాను. నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు నేను దుఃఖంతో క్రుంగిపోయాను. నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు. భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు; వారు నన్ను చూసి పళ్ళు కొరికారు.
కీర్తనలు 35:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి. నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి. నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు. నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక! నాకు హాని చేయాలని చూసే వాళ్ళు వెనక్కి తగ్గి గందరగోళానికి గురౌతారు గాక! యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక! యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక! కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు. వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ. అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను. అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు? అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు. నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది. అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను. అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను. కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు. గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.
కీర్తనలు 35:1-16 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము. యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము. ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న వారితో పోరాడుము. “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము, కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము. ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము. యెహోవా దూత వారిని తరిమేలా చేయుము. యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము. యెహోవా దూత వారిని తరుమును గాక! నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు. నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు. కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము. వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము. తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము. అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను. ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు. దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు” అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను. ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది. ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు. నేను మంచి పనులు మాత్రమే చేశాను. కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు. ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను. ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను. నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది. ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను. అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు. ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను. వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
కీర్తనలు 35:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము –నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక. యెహోవాదూత వారిని పారదోలును గాకవారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక. యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును. అప్పుడు–యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును. కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడుచేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి.
కీర్తనలు 35:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)