కీర్తనలు 25:16-22
కీర్తనలు 25:16-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి నా వేదన నుండి విడిపించండి. నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి. నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి! నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి; నాకు అవమానం కలగనివ్వకండి, ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను. నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది, కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి. దేవా, ఇశ్రాయేలు ప్రజలను వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి.
కీర్తనలు 25:16-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి. నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు. నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు. నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను. నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక. దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.
కీర్తనలు 25:16-22 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము. యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము. నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము, నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు. దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు. దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను. కనుక నన్ను కాపాడుము. దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.
కీర్తనలు 25:16-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను ఏకాకిని, బాధపడువాడను నావైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.
కీర్తనలు 25:16-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)