కీర్తనలు 23:1-6
కీర్తనలు 23:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివా సము చేసెదను.
కీర్తనలు 23:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు. పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు. నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు. చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి. నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను.
కీర్తనలు 23:1-6 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు. చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు. నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక. యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. నా పాత్ర నిండి, పొర్లిపోతుంది. నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
కీర్తనలు 23:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు. పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు. ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు. ఆయన తన నామం కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు. మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి. నా శత్రువులు ఉన్న చోటనే మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు. నూనెతో నా తల అభిషేకించారు; నా పాత్ర నిండి పొర్లుతుంది. నిశ్చయంగా నా జీవితకాలమంతా మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి. నేను నిరంతరం యెహోవా మందిరంలో నివసిస్తాను.