కీర్తనలు 22:3-5
కీర్తనలు 22:3-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు పరిశుద్ధులు; ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు. మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు. వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.
కీర్తనలు 22:3-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు పవిత్రుడవు. ఇశ్రాయేలు చేసే స్తుతులతో రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటావు. మా పితరులు నీలో నమ్మకం ఉంచారు. నువ్వు వాళ్ళను రక్షించావు. వాళ్ళు నీకు మొరపెట్టినప్పుడు విడుదల పొందారు. వాళ్ళు నీలో నమ్మకం ఉంచి నిరుత్సాహపడలేదు.
కీర్తనలు 22:3-5 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీవు పవిత్రుడవు. నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం. మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు. మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కీర్తనలు 22:3-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు ఇశ్రాయేలుచేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.
కీర్తనలు 22:3-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు పరిశుద్ధులు; ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు. మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు. వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.