కీర్తనలు 22:16-19
కీర్తనలు 22:16-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
కీర్తనలు 22:16-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు. నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి; ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు. నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు. అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
కీర్తనలు 22:16-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు. నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు. నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి.
కీర్తనలు 22:16-19 పవిత్ర బైబిల్ (TERV)
“కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది. సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు. నేను నా ఎముకల్ని చూడగలను. ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు. వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు! ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు. యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
కీర్తనలు 22:16-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలనువారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములువారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
కీర్తనలు 22:16-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)