కీర్తనలు 18:17-19
కీర్తనలు 18:17-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు. నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు. ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.
కీర్తనలు 18:17-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నన్ను ద్వేషించే నా బలమైన శత్రువులనుంచి ఆయన నన్ను రక్షించాడు. ఎందుకంటే వాళ్ళను ఎదుర్కొనే బలం నాకు లేదు. ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు.
కీర్తనలు 18:17-19 పవిత్ర బైబిల్ (TERV)
నా శత్రువులు నాకంటె బలవంతులు. ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె చాలా బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు. నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు. కాని యెహోవా నన్ను బలపర్చాడు. యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు. ఆయన నన్ను క్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.
కీర్తనలు 18:17-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్ఠులైయుండగావారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.
కీర్తనలు 18:17-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు. నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు. ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.