కీర్తనలు 17:8-10
కీర్తనలు 17:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు. నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు. వాళ్లకు ఎవరిమీదా దయ లేదు. వాళ్ళ నోళ్ళు గర్వంతో మాట్లాడుతున్నాయి.
కీర్తనలు 17:8-10 పవిత్ర బైబిల్ (TERV)
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము. యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము. నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము. ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
కీర్తనలు 17:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్క కుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.
కీర్తనలు 17:8-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి, నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి మీ కనుపాపలా నన్ను కాపాడండి; మీ రెక్కల నీడలో నన్ను దాచండి. వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి.