కీర్తనలు 15:1-3
కీర్తనలు 15:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ మందిరంలో ఉండదగినవాడు ఎవరు? నీ పవిత్ర పర్వతం మీద నివసించ గలవాడు ఎవరు? అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుంచి సత్యం పలుకుతాడు. అతడు నాలుకతో కొండేలు చెప్పడు. ఇతరులకు హాని చెయ్యడు, తన పొరుగు వాణ్ణి కించపరచడు.
కీర్తనలు 15:1-3 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు? ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు. అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు. ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు. ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
కీర్తనలు 15:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలి కానికి కీడుచేయడు తన పొరుగువానిమీద నింద మోపడు
కీర్తనలు 15:1-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు? నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు; తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు