కీర్తనలు 148:7-10
కీర్తనలు 148:7-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి. అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి. పర్వతాలూ, ఎన్నెన్నో కొండలూ, ఫలాలిచ్చే చెట్లూ, అన్ని దేవదారు వృక్షాలూ యెహోవాను స్తుతించండి. మృగాలూ, పశువులూ, నేల మీద పాకే జీవులూ, రెక్కలతో ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించండి.
కీర్తనలు 148:7-10 పవిత్ర బైబిల్ (TERV)
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు! మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి. అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు. పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను, దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు. అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
కీర్తనలు 148:7-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా
కీర్తనలు 148:7-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి, సమస్త సముద్రపు అగాధాల్లారా, మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, ఈదురు గాలులు, పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా, ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా, మృగాలు, సమస్త పశువులారా, నేలపై ప్రాకే జీవులు ఎగిరే పక్షులారా