కీర్తనలు 148:11-14
కీర్తనలు 148:11-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి. యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.
కీర్తనలు 148:11-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భూరాజులారా సమస్త దేశ ప్రజలారా, రాకుమారులారా, పాలకులారా, యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి. వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. ఆయన నామము మాత్రమే మహోన్నతం; ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది. ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి.
కీర్తనలు 148:11-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భూరాజులూ, సమస్త ప్రజల సమూహాలూ, భూమిపై ఉన్న అధిపతులూ, సమస్త న్యాయాధిపతులూ యెహోవాను స్తుతించండి. యువకులు, కన్యలు, వృద్ధులు, బాలబాలికలు అందరూ యెహోవా నామాన్ని స్తుతిస్తారు గాక. ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది. ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.
కీర్తనలు 148:11-14 పవిత్ర బైబిల్ (TERV)
భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు. నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు. యువతీ యువకులను దేవుడు చేశాడు. వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు. యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను స్తుతించండి! దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు. దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు. ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
కీర్తనలు 148:11-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి. యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.
కీర్తనలు 148:11-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)