కీర్తనలు 146:3-9

కీర్తనలు 146:3-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు.వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

షేర్ చేయి
Read కీర్తనలు 146

కీర్తనలు 146:3-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

రాజుల మీద నమ్మకం ఉంచకండి, నరులు మిమ్మల్ని రక్షించలేరు. వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు; వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి. ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు. ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు. ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు, యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు. యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.

షేర్ చేయి
Read కీర్తనలు 146

కీర్తనలు 146:3-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు. వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి. యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు. ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు. దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు. యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు. ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 146

కీర్తనలు 146:3-9 పవిత్ర బైబిల్ (TERV)

సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు. మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు. అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే. సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు. భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు. యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు. అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు. చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు. గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు. కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు. మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు. విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు. అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.

షేర్ చేయి
Read కీర్తనలు 146

కీర్తనలు 146:3-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు దురు.వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

షేర్ చేయి
Read కీర్తనలు 146

కీర్తనలు 146:3-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)