కీర్తనలు 145:14-16
కీర్తనలు 145:14-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు, అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు. అందరి కళ్లు మీ వైపు చూస్తాయి, సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు. మీరు మీ గుప్పిలి విప్పి జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
కీర్తనలు 145:14-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు. జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు. నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
కీర్తనలు 145:14-16 పవిత్ర బైబిల్ (TERV)
పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు. కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు. యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి. సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు. యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి, జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
కీర్తనలు 145:14-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.