కీర్తనలు 135:15-18
కీర్తనలు 135:15-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు. వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు. వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు. వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.
కీర్తనలు 135:15-18 పవిత్ర బైబిల్ (TERV)
ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు. కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు. ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు. మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
కీర్తనలు 135:15-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైనలేదు. వాటినిచేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటితో సమానులగుదురు.
కీర్తనలు 135:15-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి కాని చూడలేవు. చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు. వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.