కీర్తనలు 12:1-8

కీర్తనలు 12:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు; నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు. ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని తమ పెదవులతో పొగడుతారు. పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక. “మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు. “దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు. యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి. యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు, మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు, దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.

కీర్తనలు 12:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే, భక్తిపరులు అదృశ్యమై పోయారు. నమ్మకస్తులు కనిపించడం లేదు. అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు. యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి. మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే. పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం. నువ్వు యెహోవావు! నువ్వు వాళ్ళను కాపాడతావు. భక్తిగల వాళ్ళను ఈ దుర్మార్గపు తరం నుంచి శాశ్వతకాలం సంరక్షిస్తావు. మనుషుల్లో చెడుతనం ప్రబలినప్పుడు, దుర్మార్గులు అన్నివైపులా తిరుగుతారు.

కీర్తనలు 12:1-8 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా, నన్ను రక్షించుము! మంచి మనుష్యులంతా పోయారు. భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు. మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు. ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు. అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి. “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి. మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.” అని ఆ ప్రజలు చెప్పుకొంటారు. కాని యెహోవా చెబుతున్నాడు, “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు. ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు. కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.” యెహోవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి. యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు. ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు. మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

కీర్తనలు 12:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి. అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. –మా నాలుకలచేత మేము సాధించెదము మా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు. –బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

కీర్తనలు 12:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)