కీర్తనలు 119:56-62

కీర్తనలు 119:56-62 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి. నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను. మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను. దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా, నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను. మీ నీతిగల న్యాయవిధులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను.

కీర్తనలు 119:56-62 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు. నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను. నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను. భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు. న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.

కీర్తనలు 119:56-62 పవిత్ర బైబిల్ (TERV)

నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది. యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము. నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను. ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను. దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు. నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.

కీర్తనలు 119:56-62 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

కీర్తనలు 119:56-62 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)