కీర్తనలు 118:24-29

కీర్తనలు 118:24-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

షేర్ చేయి
Read కీర్తనలు 118

కీర్తనలు 118:24-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి. నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను. యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.

షేర్ చేయి
Read కీర్తనలు 118

కీర్తనలు 118:24-29 పవిత్ర బైబిల్ (TERV)

ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము! ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము. యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము! యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు. బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.” యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను. యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

షేర్ చేయి
Read కీర్తనలు 118