కీర్తనలు 118:1-4
కీర్తనలు 118:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.
కీర్తనలు 118:1-4 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
కీర్తనలు 118:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.
కీర్తనలు 118:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.