కీర్తనలు 108:4-6
కీర్తనలు 108:4-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది. దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి; భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక. మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
కీర్తనలు 108:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో. నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి.
కీర్తనలు 108:4-6 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది. నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది. దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము! సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము. దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము. నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
కీర్తనలు 108:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.
కీర్తనలు 108:4-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)