కీర్తనలు 106:32-36
కీర్తనలు 106:32-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.
కీర్తనలు 106:32-36 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు, వారి మూలంగా మోషేకు బాధ. వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, అతని పెదవుల వెంట కాని మాటలు వచ్చాయి. యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు. ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు. వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.
కీర్తనలు 106:32-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది. ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.
కీర్తనలు 106:32-36 పవిత్ర బైబిల్ (TERV)
మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది. మోషేతో ఏదో చెడు కార్యము వారు చేయించారు. ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు. అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు. కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు. ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు. ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు. ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
కీర్తనలు 106:32-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. యెహోవావారికి ఆజ్ఞాపించినట్లువారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.
కీర్తనలు 106:32-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)