కీర్తనలు 105:16-19
కీర్తనలు 105:16-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.
కీర్తనలు 105:16-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన భూమిపై కరువును పిలిచారు వారి ఆహార సరఫరా అంతా నాశనం చేశారు; వారికి ముందుగా ఒక మనుష్యుని పంపారు, ఒక బానిసగా అమ్మబడిన యోసేపును, తాను చెప్పింది జరిగే వరకు, యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది.
కీర్తనలు 105:16-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు. వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు.
కీర్తనలు 105:16-19 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు. అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు. యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు. యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు. అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు. యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.